తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిరుధాన్యాల సంరక్షణ కోసం ఆయన చేసిన కృషిని కొనసాగించాలని ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. నలభై ఏండ్ల క్రితం ఆయన డెక్కన్‌ డెవలంప్‌మెంట్‌ సొసైటీని స్థాపించి పాత పంటలు, సంప్రదాయ పంటల సంరక్షణకు కృషి చేశారని కొనియాడారు. జహీరాబాద్‌కు చెందిన మహిళా రైతులతో కలిసి ఆయన ప్రతియేటా పాత పంటల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. సంప్రదాయ పంటలు, వాటి ఆవశ్యకతను వివరించేందుకు కమ్యూనిటీ రేడియోను ప్రారంభించారని వివరించారు. 2023ను అంతర్జాతీయ మిల్లెట్‌ సంవత్సరంగా జరుపుకుంటున్న సమయంలో సతీష్‌ మరణం ఆవేదనను కలిగిస్తున్నదని తెలిపారు. ఆయన మృతికి సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు మంత్రి ఈసందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలిపారు.