మంత్రి వేములను పరామర్శించిన మంత్రి పట్నం మహేందర్ రెడ్డి

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి  పరామర్శించారు. ఇటీవల మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.సోమవారం వేల్పూర్ లోని ప్రశాంత్ రెడ్డి  నివాసంలో రాష్ట్ర గనులు, భూగర్భవనరులు సమాచార శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర సాహిత్య అకాడెమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు మంజులమ్మ చిత్ర పటానికి  పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మంత్రి,కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.