నిజామాబాద్ లో రెండు చోట్ల మంత్రి తన్నీరు హరీష్ రావు రోడ్ షో

  – సంజీవయ్య కాలనీ అర్ అర్ చౌరస్తాలో రోడ్ షో..
నవతెలంగాణ- కంఠేశ్వర్: నిజామాబాద్ నగరం లోని అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెళ్లకు పేరు పేరు న నమస్కారాలు తెలియజేస్తూ నగరంలో రెండు చోట్ల మంత్రి హరీష్ రావు శనివారం రోడ్ షో లు నిర్వహించారు. ఓటు అంటే ముడొద్దుల పండుగ కాదు 5 సంవత్సరాల మన భవిషత్తు. ప్రలోభాలకు లోబడి ఓటు వేయకూడదు. మీరు కష్టాల్లో ఉన్నపుడు మీతో గణేష్ బిగాల ఉన్నాడు.
గణేష్ బిగాల కి కరోన వచ్చిన గల్లీ గల్లీ కి తిరిగి ధైర్యం చెప్పిండు. మీకు అన్నం పెట్టి కడుపులో పెట్టుకొని చూసుకుండు. ఒకప్పుడు నిజామాబాద్ నాటికీ నేటికి తేడా ఎంత మారింది. గణేష్ బిగాల గారు నాలుగు దిక్కుల వైకుంఠదామలు కట్టిండు. రోడ్లు పెద్దగా చేసిండు-జంక్షన్లు కట్టిండు. పార్కులు నిర్మించిండు. రఘునాథ చెరువుని ఎంత మంచిగా చేసిండు. బతుకమ్మ పండుగ నాడు కన్నుల పండుగ చేసిండు. ఒకప్పుడు నేను రాను సర్కారు దవాఖానకు అంటే గణేష్ బిగాల నిజామాబాద్ దవాఖానకు కోట్లాడి నిధులు తీసుకవచ్చినాకా పోదాం బిడ్డ సర్కారు దవాఖానకు అంటున్నారు. నిజామాబాద్ దవాఖానకు సిటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్ మందులు వసతులు అన్ని గణేష్ బిగాల తెచ్చారు. ఆరోగ్య శ్రీ ద్వారా మన ప్రభుత్వ ఆసుపత్రిలో మోకాలు ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తున్నాము. ప్రభుత్వ ఆసుపత్రి లో డెలివరీ అయితే కేసీఆర్ కిట్, మందులు ఇచ్చి ఇంటికి పంపుతున్నాము. ఒకప్పుడు ఎండ కాలం లో నిజామాబాద్ నగరం లో మహిళలు మంచి నీటి ట్యాంకర్ల వెంట పోతుండే… మన ప్రభుత్వం వచ్చినాకా ఎండ కాలం అయిన వాన కాలం అయిన ప్రతి ఇంటికి శుద్ధి చేసిన మంచినీరు అందిస్తున్నాము. మన కేసీఆర్  ముఖ్యమంత్రి అయ్యాక మన కష్టాలు తిరాయి-మన బతుకులు మారాయి. 200 ఉన్న పింఛన్ 1000 చేసిండు 1000 రూ.లను 2000 చేసిండు గణేష్ బిగాల గెలిస్తే 5000 చేస్తాము. మహిళల కోసం కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, ఆరోగ్య లక్ష్మీ గృహ లక్ష్మి ఇచ్చాము. ఇపుడు సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా మహిళలకు 3000 రూ.ల భృతిని ఇవ్వబోతున్నాము. బీజేపీ పార్టీ ఒక్క మంచి పని అన్న చేసిందా, గరిబోళ్లను పట్టించుకుందా, 400 రూ.ల.సిలిండర్ ని 1200 చేసిండ్రు, మన ప్రభుత్వం వస్తే సిలిండర్ ని 400 రూ.లకే అందిస్తాము. మీరు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.ఓటు మన తలరాతని, భవిషత్తు ని నిర్ణయించేది. ఏ పార్టీ వాళ్ళు చెప్పేది నిజమెంత ? ఏ పార్టీకి ఓటు వేస్తే మన భవిషత్తు బాగుంటుంది గుండె మీద చేయి వేసి ఓటు వేయండి.మీరు కష్టాల్లో ఉన్నపుడు మీతో ఎవరున్నారు. మీరు దుఃఖం లో ఉన్నపుడు ఎవరున్నారు. మీ కష్ట సుఖల్లో ఉన్నది కేవలం గణేష్ బిగాల  మాత్రమే. ఒక్క సారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారిని గెలిపిస్తే మనం బాగుపడుతాం, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మనం బాధ పడుతం. కాబట్టి నవంబర్ 30 తారీకు కారు గుర్తుకి ఓటు వేసి గణేష్ బిగాల ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ , మాజీ మేయర్ ఆకుల సుజాత, మాజీ నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సూదం రవి చందర్, సత్య ప్రకాష్, సిర్ప రాజు, యెనుగందుల మురళి, డివిజన్ కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.