మంత్రి సుడిగాలి పర్యటన

– మంగపేట, ములుగులో పలు అభివద్ధి పనులు ప్రారంభం
నవతెలంగాణ-మంగపేట /ములుగు
రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిషు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాతోడ్‌ శుక్రవారం మంగపేట మండలంలో సుడిగాలి పర్యటన చేసి పలు అభివద్ధి పనులను ప్రారంభించారు. మండలంలోని బాలన్నగూడెంలో పాఠశాల భవనం, మండల కేంద్రంలో రెవిన్యూ గెస్ట్‌ హౌజ్‌, జీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత్‌ పెట్రోల్‌ బంక్‌, వత్తి ఎన్జీఓ ఆధ్వర్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆదివాసీ సమ్మక్క-సారక్క రైతు వత్తిదారుల కంపెనీ చిల్లీ ప్రాసెస్‌ యూనిట్‌ ను మంత్రి ములుగు జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌, జిల్లా అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) ఇలా త్రిపాఠి, జిల్లా రెవిన్యూ అధికారి కూతాటి రమాదేవి, ట్రైకార్‌ చైర్మన్‌ రామచంద్రునాయక్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ బడే నాగజ్యోతి, గ్రంధాలయ చైర్మన్‌ పోరిక గోవిందనాయక్‌తో కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవాల అనంతరం మండల కేంద్రంలోని చిల్లీ ప్రాసెస్‌ యూనిట్‌ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ములుగు జల్లాలో ఎన్నో అభివద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా పై ప్రత్యేక అభిమానం ఉంది కాబట్టే ఇక్కడ వేల కోట్ల రూపాలయ అభివద్ధి సంక్షేమ పథకాలను అమలుచేస్తుందన్నారు. ఏజన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా మంగపేట మండలంలో నేడు వందల కోట్లతో ఏర్పాటు చేసిన ఫాఠశాల అదనపు గదుల నిర్మాణం, రెవిన్యూ గెస్టు హౌజ్‌, జీసీసీ ఆధ్వర్యంలో భారత్‌ పెట్రోల్‌ బంక్‌, వత్తి ఎన్జీవో ఆధ్వర్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ సహాకారంతో చిల్లీ ప్రాసెస్‌ యూనిట్‌ లను ప్రారంభించి మండల ప్రజలకు అంకితమిచ్చినట్లు తెలిపారు. భవిష్యత్‌లోనూ మండల అభివద్ధికి మరిన్ని నిధులు మంజూరీ చేసి అభివద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా, మండల నాయకులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
జాకారంలో జీసిసి ఫీలింగ్‌ స్టేషన్‌కు శంకుస్థాపన
ములుగు మండలంలోని జాకారంలో జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీష్‌, ట్రైకార్‌ ఛైర్మెన్‌ రాంచెంద్రు నాయక్‌, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్‌ వాల్య నాయక్‌, ఐటీడీఏ పీవో అంకిత్‌, ఎస్పీ గౌస్‌ ఆలం, జిల్లా అదనపు కలెక్టర్‌ స్థానిక సంస్థలు ఇలా త్రిపాఠి, జెడ్పి వైస్‌ చైర్మన్‌ బడే నాగజ్యోతిలతో కలసి జిసిసి ఫీలింగ్‌ స్టేషన్‌ నిర్మాణ పనుల గిరిజన,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. కాగా గట్టమ్మ దేవాలయం వద్ద మంత్రి సత్యవతి రాథోడ్‌,ట్రై కార్‌ ఛైర్మెన్‌ రాంచెంద్రు నాయక్‌, జిసిసి చైర్మన్‌ వాల్య నాయక్‌లకు ములుగు జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీష్‌ పార్టీ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు గట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ పోరిక గోవింద నాయక్‌, డిఆర్‌ఓ కే రమాదేవి, ములుగు జడ్పిటిసి సకినాల భవాని,ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి,ఎంపీటీసీ రాధిక, డిసిసి డిఎం ప్రతాపరెడ్డి, డిటిడిఓ దేశిరామ్‌,జిసిసి మేనేజర్‌ శ్రీనివాస్‌, తహసిల్దార్‌ సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో ఇక్బాల్‌,జాకారం సర్పంచ్‌ దాసరి రమేష్‌, మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్‌, ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు పోరిక విజయ రామ్‌ నాయక్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ నాగ జ్యోతి, ములుగు టౌన్‌ చెన్న విజరు, కోగిల మహేష్‌, సాగర్‌ ఉన్నారు.