నవతెలంగాణ – ఆర్మూర్
బిజెపి పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల పేరిట చేయడానికి నివసిస్తూ బ్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి జాతీయ పతాకం కింద నిరసన కార్యక్రమం శుక్రవారం నిర్వహించినారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి మాట్లాడుతూ… దశాబ్ది ఉత్సవాల పేరున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అత్యంత హేయమైన విషయం 2018లో మంజూరైన నిధులను 70 కోట్ల నిధులను ఇప్పుడు మంజూరైనట్టుగా ఇప్పుడు మంజూరైనట్లుగా ప్రారంభించక ముందే ఏదో జరిగిపోయినట్టుగా దశాబ్ ఉత్సవాలు జరపడం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే హాస్పిటల్లో వంద పడకల ఆస్పత్రి అని ప్రచారం చేసుకోవడం మినహా అక్కడ డాక్టర్లు లేరు సిబ్బంది లేరు మౌలిక సదుపాయాలు లేవు 121 సిబ్బంది ఉండవలసిన చోట దాదాపు 30 మంది సిబ్బంది ఉండడం నిజం కాదా ఇది వాస్తవం కదా అంబేద్కర్ సాక్షిగా ఫౌంటెన్ చెడిపోయి సంవత్సర కాలం గడిచిన వీరు స్పందించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తే ఈరోజు బాగుపడ్డ విషయం వాస్తవం కాదా. మినీ స్టేడియంలో ఒక్క 1కోటి50 లక్షలతో ఇండోర్ స్టేడియం ప్రారంభించక ముందే శిథిలావస్థకు చేరుకున్న విషయం వాస్తవం కాదా? దీనిని అభివృద్ధి అంటారా అట్లనే మొక్కల పేరు మీద నీటి ట్యాంకర్ల పేరుమీద, అక్రమ ఇంటి నెంబర్ల పేరు మీద, మాటుకాలను కబ్జా చేసుకుని హిస్టారీతిన ఆర్మూర్ మున్సిపల్ అవినీతి జరుగుతుంటే మీరు మౌనంగా ఉన్న విషయం వాస్తవం కాదా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అట్లాగే ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి క్యాంప్ ఆఫీసుకు వచ్చింది ఎప్పుడు ఇప్పుడు తేదీ 9 6 2023 నాడు జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తము పెద్దపెద్ద చెట్లను పెట్టడానికి 7 లక్షల రూపాయలు కేటాయించుకోవడం ఇది దేనికి సంకేతం. జిల్లా కలెక్టర్ గారికి వెంకన్న అనే కాంట్రాక్టర్ నాకు మూడు లక్షల పదివేల రూపాయలు గుంతలు కొట్టడానికి నాకు వచ్చేటివి ఉన్నాయి నాకు ఇవ్వట్లేదు అప్పటి కమిషనర్ శైలజ మేడంని అడిగితే అది ఇచ్చేసినము ఆ బిల్లు నువ్వు ఎవరికైతే చెల్లించి చెల్లించినమో వారిని అడుక్కపో అన్న మాట వాస్తవం కాదా. ఇంత అవినీతి జరుగుతున్న మీరు మౌనంగా ఉండడం ఇంకా అభివృద్ధి జరిగిందని చెప్పుకోవడం ఇది దేనికి సంకేతం. ఇది కేవలము రాబోవు ఎన్నికల కొరకు ఆడుతున్న నాటకం తప్ప అభివృద్ధి లేదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరియు ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తాం. జిల్లా కలెక్టర్ ఆర్మూర్ మున్సిపాలిటీ పై ఆర్మూర్ లో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకుంటారా లేక అవినీతి పరుల పక్కన నిలుస్తారా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి.