విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన

విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి..
– పోలీసులకు అప్పగింత
నవతెలంగాణ-ఆర్మూర్‌
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిలతో అసభ్యం గా ప్రవర్తించగా దేహశుద్ధి చేసి పోలీసు లకు అప్పగించారు. ఈ ఘటన నిజామా బాద్‌ జిల్లా ఆర్మూర్‌ పెర్కిట్‌ ఉర్దూ మీడియం పాఠశాలలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెర్కిట్‌లోని ఉర్దూ మీడియం పాఠశాలలో ఇబ్రహీం అనే ఉపాధ్యాయుడు కొన్ని రోజుల నుంచి విద్యార్థినిలతో అసభ్యం గా ప్రవర్తిస్తున్నాడు. గతంలో ఇలాంటి ఘటన వెలుగు చూసినా ప్రధానో పాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదని విద్యార్థినుల తల్లి దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు మాట్లాడు తూ.. అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయునిపై 15 రోజుల కింద హెడ్మా స్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం పాఠశాలకు వచ్చి కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్ప గించారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్‌ సుల్తానా మాట్లాడుతూ రెండు రోజుల కిందనే తమ దృష్టికి వచ్చిందని, అతనిపై చర్యలు తీసుకుంటామని తెలి పారు. ఈ విషయమై మండల విద్యాధికారి రాజా గంగారం మాట్లాడుతూ.. బాధితుల వివరాలను తీసుకొని సంబంధిత ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.