స్నేహితురాలి ఇంటికి వెళ్ళిన యువతి అదృశ్యం

నవతెలంగాణ-జవహర్‌నగర్‌
స్నేహితురాలి ఇంటికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళిన యువతి అదృశ్యమైంది. ఈ ఘటన జవహర్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. సీఐ సీతారాం వివరాల ప్రకారం జవహర్‌ నగర్‌ కార్పొరేషన్‌ శ్రీరామనగర్‌ కాలనీలో చిమర్ల గోపాలకృష్ణ, భార్య రాధ, ఇద్దరు కుమార్తెలు, కొడుకుతో కలిసి నివాసముంటున్నారు. ఈ నెల 12వ తేదీన రాధా చిన్న కుమార్తె స్వర్ణలత స్నేహితురాలి ఇంటికి వెళుతున్నానని చెప్పి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా సమాచారం లభించలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.