ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వెన్నంటే  ఉంటాం..

– మున్నూరు కాపు, యాదవ సంఘ సబ్యుల ఏకగ్రీవంగా తీర్మానం..
నవతెలంగాణ- డిచ్ పల్లి
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వెన్నంటే ఉంటామని వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గుంపు గుత్తగా మున్నూరు కాపు, యాదవ సంఘ సబ్యులు ఉంటామని ఏకగ్రీవంగా తీర్మానించారు.శనివారం ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో మున్నూరు కాపు, యాదవ సంఘ సబ్యులు వేర్వేరుగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకుని పలు విషయాలపై చర్చించుకుని వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు.ఈ సందర్భంగా ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్,సంఘ సబ్యులు మాట్లాడుతూ ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిఅర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు కనివిని ఎరుగని రీతిలో సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారని ఇదే కాకుండా నీయోజకవర్గ పరిదిలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా ప్రచారం చేస్తామని, రూరల్ నుండి హెట్రిక్ నమోదు చేయడం ఖాయమని వారన్నారు.గ్రామ అవసరాల మేరకు నీదులను మంజూరు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేశారని వివరించారు.తిర్మనించిన ప్రతులను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు అందజేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో,వైస్ ఎంపీపీ భూసని అంజయ్య, సీనియర్ నాయకులు నోముల లక్ష్మారెడ్డి,
మున్నూరు కాపు, యాదవ సంఘ సబ్యులు, శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు.