మంత్రి పి పరామర్శించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..

నవతెలంగాణ -డిచ్ పల్లి
మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ పరామర్శించారు.శనివారం వేల్పూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్.. కీర్తిశేషులు మంజులమ్మ  చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేముల ప్రశాంత్‌ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. పరమర్శించిన వారిలో  జిల్లా యువ నాయకులు, జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు, ధర్పల్లి జెడ్పిటిసి  బాజిరెడ్డి జగన్మోహన్, ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలు చెందిన ఎంపీపీలు బాదవత్ రమేష్ నాయక్, జడ్పిటిసిలు, సర్పంచులు, ఎంపిటిసిలు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.