మృతురాలి కుటుంబాన్ని  ఫోన్లో పరామర్శించిన ఎమ్మెల్యే ఈటల

నవతెలంగాణ- జమ్మికుంట
 జమ్మికుంట పట్టణంలోని శ్రీరామ హాస్పిటల్ డాక్టర్ వొల్లాల శ్రీనివాస్  తల్లి బతుకమ్మ అనారోగ్యంతో శనివారం మృతి చెందగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫోన్లో పరామర్శించి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ,మాజీ జెడ్పిటిసి అరుకాల వీరశలింగం ఐఎంఏ హుజరాబాద్, జమ్మికుంట అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ అంకం సుధాకర్, డాక్టర్ ఉడుగుల సురేష్ మాజీ అధ్యక్షులు డాక్టర్ శనిగరపు తిరుపతయ్య, డాక్టర్ ముక్క రాము డాక్టర్లు వంశి ,ఆకుల శ్రీనివాస్, కిషోర్ కామిశెట్టి, సురేష్  ముషం, సురంజన్ ,ముక్క వాణి,ఓల్లాల రాణి, ముక్క రాజేశ్వరయ్య, చిట్టి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తిరుపతి, దేవేందర్ రెడ్డి, రమేష్ మృత దేహానికి పూలమాల వేసి  నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.