గులాబీ పార్టీకి కంచుకోట ఉమ్మడి జిల్లా.. ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే

నవతెలంగాణ -ఆర్మూర్ 

 ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోట అని నిత్యం ప్రజల్లో ఉంటూ అభివృద్ధి పనులు చేసినామని స్థానిక ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. మండలంలోని పి ఫ్రీ గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు యువకులు పెద్ద ఎత్తున సభకు హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి చేరినాయని ప్రజల నుంచి బి ఆర్ ఎస్ కు వస్తున్న స్పందనను చూసి ప్రతిపక్ష పార్టీలు కుదేలవుతున్నాయని అన్నారు ..ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆశాపురం దేవి శ్రీనివాస్ రెడ్డి ,సొసైటీ చైర్మన్ సోమ హేమంత్ రెడ్డి, ఎంపీటీసీ సమర సురేష్, బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.