రేవల్లి – నవ తెలంగాణ:
రేవల్లి మండలం బండరాయి పకుల గ్రామ ఉపసర్పంచ్ పూర్ణకంటి రేణుక భర్త కిరణ్ ( మంత్రి ) నిరంజన్ రెడ్డికి మూడోసారి వనపర్తి జిల్లా నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా ప్రజల పట్ల చేసిన మంచి కార్యక్రమాల వల్ల ఆయనకు గుర్తింపు దక్కింది అని తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డికి మేము మద్దతు పలుకుతున్నామని, సర్ ఎక్కడ ఉన్న ఆరోగ్యంగా బాగుండాలని, ప్రజల ఆశీర్వాదాలు తీసుకొని ప్రజల కోసం పోరాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణ, శ్రీరాములు, రాజేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.