కెసిఆర్ ప్రభుత్వంతోనే పేదల సంక్షేమం.. ఎమ్మెల్యే షకీల్ ఆమీర్

నవ తెలంగాణ- నవీపేట్: కేసీఆర్ ప్రభుత్వం తోనే తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమం సాధ్యమవుతుందని షకీల్ అమీర్ అన్నారు. మండల కేంద్రంలో రోడ్ షో ద్వారా మంగళవారం ప్రచారం నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభి ంచి ప్రధాన రహదారి గుండా వెళ్లి పలు కాలనీలలో ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఆర్ఆర్ గార్డెన్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ అమలు కావడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్లీ కరెంటు కష్టాలు కొని తెచ్చుకోవాల్సిందేనని అన్నారు. కాబట్టి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఆయన వెంట టిఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.