నవతెలంగాణ-మంగపేట
యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న కేసిఆర్ అరాచక పాలనను యువతే అంతమొందించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బుధవారం మం డలంలోని మల్లూరు గ్రామంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెల నరేష్ అధ్యక్షతన యువజన నాయకుల విస్తృ స్థాయి సమావేశం బుధవారం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సీతక్క మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడగానే ఓట్ల కోసం ప్రజల దగ్గరకు వస్తున్న బీఆర్‌ఎస్ నాయ కులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. గెలుపు ఓటములతో సంబ ంధం లేకుండా ప్రజా సేవకు అంకితమైన నాయకులను ఎన్నుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈప్రాంతంలో కురిసిన భారి వర్షాలకు దెబ్బతిన్న కాలువలకు గండ్లు పూడ్ఛకుండా, తెగిన రోడ్లకు మరమ్మత్తులు చేయి ంచకుండా ప్రజలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తుందని మండి పడ్డారు. ఈ ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత లేదని పేద ప్రజలకు మేలు చేఅవలనే ఆలోచనే కరువైందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిం చుకుంటేనే ఈరాష్ట్ర ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.