నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ రుక్మిణీ పాండురంగ విటలేశ్వర ఆలయంలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు బీఅర్ఎస్ పార్టీ ఎన్అర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల వారి కుటుంబ సభ్యులు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు గురువారం నిర్వహించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామి వారికి సుప్రభాతం సేవలతో విశేష పూజలు ప్రారంబించారు. విశేష పంచామృత మహ అభిషేకం, తులసిదల సహిత లక్షపుష్పార్చన నిర్వహణ, మహా హారతినిచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. ఆలయంలో గ్రామస్థులు, చుట్టుప్రక్కల గ్రామస్థులు ఆలయంలో విటలేశ్వరున్ని దర్శించుకుని, బాజన కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అశోక్ కుమార్, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.