నవ తెలంగాణ ఆర్మూర్ : ఆలూరు మండల కేంద్రం లోని దేగాo నుండి గోదావరి ఒడ్డు వరకు 4.65 కోట్లతో ఏర్పాటు చేయనున్న బీటీ రోడ్ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి శంకు స్థాపన చేసినారు. బతుకమ్మ చీరలు ,యూత్ కు క్రీడా సామగ్రి పంపిణీ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పస్కా నరసయ్య, జెడ్పిటిసి మెట్టు సంతోష్, గ్రామ సర్పంచ్ గడ్డం సరోజ గంగారెడ్డి, మాజీ సర్పంచ్ గణేష్, ఎంపీటీసీ అనూష తదితరులు పాల్గొన్నారు.