
శనివారం రోజున బోర్గం (పీ) సమీపంలోని ఈస్ట్ బ్యాంక్ కాలనీ లో గల, కమ్యూనిటీహాల్ లో నిలిపిన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లోనీ 14వ వార్షికోత్సవం సందర్భంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మోపాల్ మండలం కంజర్ గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత కి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్దన్ ,ఈ సందర్భంగా మాట్లాడుతూ దుర్గాదేవి దయవల్ల గ్రామాలలో పాడిపంటలు అభివృద్ధి చెందాలని పంట పొలాల సస్యశ్యామలంగా ఉండాలని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆయన తెలిపారు. అలాగే యువకులు యుక్తవయసులో మాల ధరించడం వల్ల కూడా దైవభక్తి మార్గం పెంపొంది మంచి చెడుల వ్యత్యాసం తెలుస్తుందని అలాగే ఈ దినచర్య వల్ల మంచి మార్గంలో పయనించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల డిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ఈగ సంజీవరెడ్డి పార్టీ మండల అధ్యక్షులు మొచ్చ శ్రీను, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీనివాసరావు, స్థానిక ఎంపీపీ లతా కన్నీరామ్, జడ్పిటిసి కమల నరేష్, సర్పంచులు ముత్యం రెడ్డి, సిద్ధార్థ, భరత్, రవి, సాయ రెడ్డి ఎంపిటిసి శ్రావణ్ , ఎస్సీ సెల్ కన్వీనర్ భూమన్న, సొసైటీ చైర్మన్లు ఉమాపతిరావు, నిమ్మల మోహన్ రెడ్డి, మరియు చిన్నారెడ్డి, కెంపు భూమయ్య తదితరులు పాల్గొన్నారు.