నవతెలంగాణ- మోపాల్
మొపాల్ మండలం ముదక్ పల్లి గ్రామానికి చెందిన ఎస్సీ కమ్యూనిటీ భవనానికి 7.50 లక్షలు ప్రోసిడింగ్ ఆర్డర్స్ పత్రాలను పంపిణీ చేశారు.ఎస్సీ కమ్యూనిటీ సోదరులు తమ సొంత స్థలంలో భవన నిర్మాణం చేసుకుంటామని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ గారిని కలిసి కోరగా.ఈ మేరకు ఆయన నిధులనుండి కేటాయిస్తూ ప్రొసీడింగ్ ఆర్డర్స్ పత్రాలను సంబంధిత ఎస్సీ కమ్యూనిటీ కుల సంఘ సభ్యులకు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎస్సీ కమ్యూనిటీ కుల సంఘ సభ్యులు తదితరులు ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మరియు జిల్లా యువ నాయకులు జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు ధర్పల్లి జెడ్పిటిసి శ్రీ బాజిరెడ్డి జగన్మోహన్ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడ్డాక అన్ని కులాలు వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది,అన్ని వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంతగానో కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారూ అని అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 47 కోట్లు.ఎస్ డి ఎఫ్ మరియు సి డి పి నిధులతో చాలావరకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకోవడం జరిగింది, ఇంకా జరుగుతున్నాయి, ప్రతి గ్రామంలో ఇప్పటివరకు 25 కోట్ల రూపాయలతో ఎనర్జీ ఎస్ ద్వారా ప్రతి గ్రామ గ్రామాన సిసి రోడ్స్ డ్రైనేజీలు నిర్మాణం పనులు పూర్తి చేయడం జరిగింది ఇంకా మరిన్ని జరుగుతున్నాయి అని తెలిపారు.