నవ తెలంగాణ- రాజంపేట్ : రాజంపేట్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. సిసి రోడ్లు, డ్రైనేజీలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం రెండవ అంతస్తుల ప్రారంభం, మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా గదులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొండా హనుమాన్లు ఎంపీపీ లింగాల స్వరూప, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్వంతరావ్, పిఎసిఎస్ చైర్మన్ నల్లవెల్లి అశోక్, సీనియర్ నాయకులు జూకంటి మోహన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఆముదల సౌమ్య, ఉప సర్పంచ్ శివ, నాయకులు రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.