అభివృద్ధిలో ఎమ్మెల్యే పాత్ర కియాశీలమన్న మేయర్

నవతెలంగాణ-కంటేశ్వర్ : నగరంలోని రెండు డివిజన్ల పరిధిలో సుమారు 22. 50లక్షల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు మేయర్ దండు నీతూ కిరణ్ సోమవారం తెలిపారు. 17వ డివిజన్ గౌతమ్ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద సీసీ డ్రైనేజీ పనుల నిర్మాణానికి మరియు 9వ డివిజన్ ఇంద్రపూర్ కాలనిలో 10లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పిరేటర్లు మాయావర్ సవిత, సాదు సాయి వర్ధన్, ఇంజినీర్లు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.