నవతెలంగాణ- కంఠేశ్వర్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల ఆటో నగర్ లో ఆటో టెక్నిషియన్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్నారు.నిజామాబాద్ నగరం లో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరించి కారు గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్కో మాజీ చైర్మన్ ఎస్ ఏ అలీం, బీఆర్ఎస్ నాయకులు మీర్ మాజాజ్ అలీ, నవీద్ ఇక్బల్, కరీముద్దీన్ కమల్, ఫయాజ్, అమర్, మతీన్, సన ఉల్లా తదితరులు పాల్గొన్నారు.