
– బీఅర్ఎస్ ప్రభుత్వం అంటే బిసి ల ప్రభుత్వం
– కన్న తల్లి వంటి కుల వృత్తుల కు బి అర్ ఎస్ పాలనలో పూర్వ వైభవం
– కుల వృత్తులు పూర్వ వైభవం తీసుకువస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్
నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ ప్రాంతంలో గల గౌడ సంఘంలో గౌడ ఆత్మీయ సమ్మేళనంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్సీ కవితను గౌడ సంఘం సభ్యులు గీతా కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీసీలకు ప్రభుత్వం కన్నతల్లి వంటి కుల వృత్తుల కు తమ పాలనలో పూర్వ వైభగం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోవచ్చారని తెలిపారు. ఎన్నికల నగారా నిన్ననే మోగింది. మొట్టమొదటి సమావేశం గౌడ కుల బాంధావులతో జరురుకోవటం సంతోషకరం.గత ప్రభుత్వాలు గౌడ కులస్తులను కల్లు వ్యాపారాన్ని చిన్న చూపు చూశారు.కానీ కేసీఆర్ ఆనడే ఉద్యమ సమయం లో చెప్పారు.తెలంగాణ ఏర్పాటు అయితే గౌడ కులస్తులకు అండగా ఉంటాం అన్నారు.అలాంటి కులవృత్తుల ను పునరుద్ధరించెందుకు సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారు. గీత కార్మికుల కు ఏమైనా సమస్యలు ఉంటే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తాము అని తెలిపారు. ప్రభుత్వం పాలసీ గా తీసుకొని ఈత వనాలని పెంచుతుంది. మద్యం టెండర్ల లో 15 శాతం గౌడ కులస్తులకు రిజర్వేషన్ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి నీ అధికారికంగా నిర్వహిస్తున్నం అని తెలియజేశారు. గత ప్రభుత్వాల కాలం లో నిజామాబాద్ నుండి ఎంతో మంది పెద్దనాయకులు పనిచేశారు.జిల్లాకు ఒకటే బిసి హాస్టల్ ఉండే.అలాంటిది ఈరోజు 15 బిసి హాస్టల్ లను ఏర్పాటు చేసుకున్నాం.రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది బిసి బిడ్డలకు ఫీజు రింయంబర్స్ మెంట్ ఇస్తున్నాం.తెలంగాణ లోఉన్నది బి అర్ ఎస్ ప్రభుత్వం కాదు బిసి ల ప్రభుత్వం. ఎన్నికలపుడు అనేక పార్టీలు వస్తాయి, వారిని నిలదీయండి అని తెలిపారు.పనిచేశాం కాబట్టి హక్కుగా ప్రజల వద్దకు వస్తున్నాం ఆశీర్వదించండి అని అడుగుతున్నామన్నారు.డిసెంబర్ 3 తర్వాత మళ్లీ ఏర్పడేది బి అర్ ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతో పాటు అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ విజి గౌడ్, టీఎస్ డబ్ల్యూ సి డి సి చైపర్సన్ ఆకుల లలిత, నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్, తో పాటు ఒకటవ కళ్ళు డిపో యజమానులు, సభ్యులు, కుటుంబ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.