పడంపల్లి లో మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త కుటింబికులకు ఎమ్మెలే పరామర్శ

నవతెలంగాణ – జుక్కల్: మండలంలోని పడంపల్లి గ్రామానికి చెందిన లక్షెట్టి మల్లికార్జున్ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్త ఇటివలే అనారోగ్యంతో మరణించడం జర్గింది. శుక్రవారం నాడు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెలే హన్మంత్ షిండే మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త కుటింబికులకు పరామర్శించారు. ప్రభూత్వ పరంగా, పార్టీ పరంగా తాను అన్ని విధాలుగా అదుకొంటానని హమీనిచ్చారు. మరణించిన కార్యకర్త జీపీ వార్జు మెంబర్ గా ఉన్నారని రోబోయే రోజులలో పార్టీ గుర్తించి సహయం చేస్తామని ఎమ్మెలే బరోసా కల్పించారు. ఎమ్మెలే హన్మంత్ షిండే తో పాటు గ్రామసర్పంచ్ గణేష్ పటేల్,  మాజీ మార్కేట్ చైర్మేన్ సాయాగౌడ్, మాజీ విండో చైర్మేన్ రాజుపటేల్, సీనీయర్ నాయకుడు నీలుపటేల్, వార్డు జీపీ సబ్యురాలు ఎల్ . సురేఖ గ్రామ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లక్షెట్టి బస్వంత్ పర్బతా, సంతోష్, పవన్, ఎల్. ఉమాకాంత్, కాశీనాథ్ తదితరులు పాల్గోన్నారు.