పేదరికం నిర్మూలనే మోడీ లక్ష్యం

– బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పేదరికం నిర్మూలనే మోడీ లక్ష్యం
– బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా
నవతెలంగాణ- కందనూలు
నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదరికం నిర్మూలన కోసం పనిచేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జే పి నడ్డా తెలిపారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నవ సంకల్ప సభ ఆదివారం సాయంత్రం జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జేపీ నడ్డా మాట్లాడుతూ.. అమరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో ఒక్క కేసీఆర్‌ కుటుంబమే బాగుపడిందని, ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పులేదని విమర్శించారు. అంధకారంలోఉన్న తెలంగాణ అభివృద్ధి కావాలంటే రాష్ట్రంలో కమలం వికసించాలన్నారు. ఏ దేశం పోయినా మోడీని హీరో అంటూ.. గ్లోబల్‌ లీడర్‌ అంటూ పొగుడుతున్నారని, కాంగ్రెస్‌ నాయకులు మాత్రం చారువాలా అంటూ విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లోనే ఏ ప్రధాని పొందని మన్ననలను ప్రపంచంలో మోడీ పొందారని తెలిపారు. సభలో బీజేపీ రాష్ట్ర ప్రతినిధులు, వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.