మాల మహానాడు జిల్లా అధ్యక్షుడిగా మోహన్ రావు ఎన్నిక

– మోహన్ రావుకు నియామక పత్రాన్ని అందజేస్తున్న జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు మన్య శ్రీధర్ రావు
నవతెలంగాణ- కంఠేశ్వర్:
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడిగా ముచ్చటగా మూడోసారి చిట్టెపు మోహన్ రావు ఎన్నికయ్యారు. హైదరాబాదు నగరంలోని సోమాజిగూడలో ఏర్పాటు చేసిన మాల మహానాడు రాష్ట్రస్థాయి సమావేశంలో ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు మన్నే శ్రీధర్ రావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీల నాయకుల ఆధ్వర్యంలో మోహన్ రావు ను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మోహన్ రావు మాట్లాడుతూ.. జిల్లాలో మాల మహానాడు బలోపేతానికి మరింత కృషి చేస్తానని చెప్పారు. పరిధిలో ఉన్న మూడు రెవెన్యూ డివిజన్ ప్రాంతాలలో పర్యటించి మాలలను ఏకతాటి పైకి తెచ్చి, జిల్లాలో ఉన్న మాలల సహకారంతో ముందుకు సాగుతానని చెప్పారు. మాలల సమస్యలను ఎదుర్కోవడంలో ఎల్లప్పుడూ ముందుంటానని మోహన్ రావు అన్నారు.తన ఎంపికకు కృషి చేసిన జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నీరడి రవిలకు మోహన్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.