నవతెలంగాణ-జనగామ
ప్రజా సమస్యల పరిష్కారా నికి అసెంబ్లీలో ప్రశ్నించే గొం తుక అవసరమని అది కమ్యూని స్టులతోనే సాధ్యమవుతుందని సీపీఐ(ఎం) జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మోకు కనకారెడ్డి అన్నారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జనగామ నియో జకవర్గం పార్టీ అభ్యర్థిగా పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పేరు ప్రకటించడం పట్ల ఆ పార్టీ జిల్లా శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా జనగామ ఆర్టీసీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమావేశారు. పార్టీ శ్రేణులు పెద్దఎత్తున బాణాసంచా పేల్చారు. అ నంతరం అభ్యర్థి మోకు కనకారెడ్డి మాట్లా డుతూ.. జనగామ గడ్డకు ఘనమైన పోరాట చరిత్ర ఉందన్నారు. తెలంగాణ రైతాంగ సా యుధ పోరాట స్పూర్తిని పునికిపుచ్చుకొని జనగా మలో కార్మిక, రైతు, యువజన, విద్యార్థి, మహి ళల సమస్యలతోపాటు నియోజకవర్గం అభి వృద్ధికై అనేక పోరాటాలు నిర్వహించిన ఘనత తమ పార్టీకి ఉందన్నారు. జనగామ ని యోజ కవర్గం అభివృద్ధి చెందాలంటే సుత్తే కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. జనగామ ప్రాంతం అభివద్ధిలో ఆమడ దూరం ఉందని, దీనికి కారణం పాలకులేనని అన్నారు. జనగామ ప్రజా సమస్య లపై, జన గామ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక గల ఏకైక పార్టీ సీపీఐ(ఎం) అన్నారు. అనునిత్యం ప్రజా స మస్యల పరిష్కా రమే ఎజెండాగా పనిచేస్తూ అలుపెరుగని పో రాటం చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థినైన తనను ఆదరించి భారీ మెజారిటితో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి, రాపర్తి రాజు, ఇర్రి అహల్య, పార్టీ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్, పోత్కనూరి ఉపేందర్, భూక్యా చందు, ఎండి ఆజారోద్దిన్, బిట్ల గణేష్, మండల కార్యదర్శి గంగాపురం మహేందర్, పట్టణ కమిటీ సభ్యులు బోట్ల శ్రావణ్, కళ్యాణం లింగం, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు దాడిదే సందీప్, పార్టీ నాయకులు ఆర్ మిట్యా నాయక్, సాంబరాజు దుర్గాప్రసాద్, పోత్కనూరి కనకచారి, కొండ వరలక్ష్మి, గంగరబోయిన మల్లేష్ రాజ్, బి. విష్ణు, పాము శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.