నవతెలంగాణ- ఆర్మూర్
మండలంలోని అంకాపూర్ గ్రామంలో డబుల్ బెడ్ ఇళ్లను బీజేపీ నాయకుడు పైడి రాకేష్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు ఇల్లు ఇస్తాం అని చెప్పి తొమ్మిది ఏళ్లు అవుతున్న ఆర్మూర్ లో ఒక్క ఇల్లు ఇవ్వని చేతగాని ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అని ఆర్మూర్ తొలి పర్యటన చేసిన కెసిఆర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్లర్ల దశలో ఉంది అని ఎమ్మెల్యే అనుచరులు ఇల్లు ఇప్పిస్తాం అని డబ్బులు వసూలు చేస్తున్నారు అని గృహలక్ష్మి అంటూ కొత్త నాటకాలకు తెరలిపినరు అని బీజేపీ ప్రభుత్వం వస్తె పేదలకు విద్య, వైద్య,ఇల్లు ఇవ్వడం ముఖ్య ఉద్దేశం అని అన్నారు ఈ కార్యక్రమంలో రాజేందర్,నరేష్,తదితరులు పాల్గొన్నారు.