ఎరువుల కొరత లేకుండా జాగ్రత్తలు
అందుబాటులోకి విత్తనాలు
నకిలీ విత్తనాలు నివారించేందుకు
పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టర్ ఎస్. హరీష్
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఈ ఏడాది వానకాలం పంటల సాగు అంచనాలు 4, 39,750 ఎకరాలు, ఇందుకు సరిపడ విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, జిల్లా సహకార సంస్థ, మార్కఫెడ్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వ హించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మరో పక్షం రోజుల్లో ఖరీఫ్ పంటల సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, సి బ్బంది రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అం దించాలన్నారు. జిల్లాలో 4,39,750 ఎకరాలలో సాగు చేస్తా రని అంచనా, అందుకు అనుగుణంగా ఎరువుల విషయంలో రైతులు అనవసర ఆందోళనకు గురి కాకుండా, వారి అవసరాలకు సరిపడా అందుబాటులో ఉన్నాయని వా రికి స్పష్టమైన భరోసా కల్పించాలన్నారు. ఎరువుల వినియో గానికి సంబంధించిన వివరాలను ఈ-పాస్‌లో నమోదయ్యే లా ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ఈ విషయాలను క్షేత్రస్థాయిలో రైతులకు తెలియజేస్తూ, ఎరువుల విషయంలో వారు ఎలాంటి ఆందోళనకు లోనూ కాకుండా, అనవసర వదంతులను నమ్మకుండా చూడాలన్నారు. విత్తనాలు, ఎరువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖరీఫ్ సీజన్‌ను విజయవంతంగా చేయగలుగుతామన్నారు. మండలాల్లో సొసైటీల్లో, అగ్రి సేవా కేంద్రం, డీలర్ల వద్ద ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి, జిల్లా సహకార సంస్థ అధికారి ధాత్రి దేవి, మార్కఫెడ్ అధికారి తహేమీన తహేసీన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.