ఆర్భాటాలు ఎక్కువ… ఆచరణ తక్కువ !

నవతెలంగాణ-మహదేవపూర్‌
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంథని నియోజకవర్గం లో నాయకులు శుభ అశుభ కార్యక్రమంలో బిజీబిజీగా ఉన్నారు. ఏ చిన్న కార్యక్రమమైనా నాయకులు ప్రజల వద్దకు వెళ్లి పరామర్శిస్తూ తమ వైపు తిప్పుకునే పనిలోపడ్డారు. మంథని నియోజకవర్గంలోని వివిధ పార్టీల ప్రముఖ నాయకులు గత కొంతకాలంగా నియోజకవర్గకు టుంబాలలో ఎలాంటి చిన్న కార్యక్రమాలు జరిగిన అక్కడికి వెళ్లి పరామర్శిస్తూ మేమున్నామంటూ హామీలు గుప్పిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న కొందరు పరామర్శలతో పాటు తమకు తోచిన విధంగా సహాయం అందిస్తూ ప్రజల ను ఆకర్షిస్తుండడంతో ప్రజల్లో వివిధ రకాల ఆలోచనలను రేకెత్తిస్తున్నారు. తామేమీ తక్కువ తిన్నామా అన్నట్లు ప్రజలు నాయకులతో సమా నంగా వ్యవహరిస్తూ తమ వద్దకు వచ్చిన ప్రతీ నాయకునితో కలుపుగోలుగా ఉంటూ సామరస్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒకే కుటుంబంలో నలుగురు అన్నదమ్ము లుంటే నలుగురు నాలుగు పార్టీలలో పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలి అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. ఎన్నికల ముందు ఆత్మీయ సభలని, ఆత్మగౌరవ సభలన్ఱే సమావేశాలు ఏర్పాటు చేసి కులాల వారీగా ఓటర్లను పిలిచి విందులు, వినోదాలు చేయడం రాష్ట్రంలో ప్రతి ఎన్నికల ముందు ఓ తంతు జరుగుతున్నది. ఇచ్చిన హామీలు, చెప్పిన అంశాలు దాటవేస్తూ పదేపదే వాయిదాలు వేస్తున్న పాలకులు ఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. కుల సంఘాల నాయకులకు, పార్టీలో ఉన్న వివిధ కుల సంఘ నాయకులకు గిరాకీ బాగా ఉంటున్నది తప్పితే ఆయా వర్గాల సంక్షేమ లక్ష్యం నెరవేరడం లేదు. ఓటర్ల పేరిట నాయకులే ఎవరికి దొరికినంత వాళ్లు ప్రయో జనం పొందుతున్నారు. వీళ్లంతా పార్టీకి ఓట్ల సమీకరణలో కూత పిట్టలుగా ఉపయోగపడుతున్నారు.అనేక హామీలు ఇచ్చి, వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని అధికారం అనుభవించిన నాయకులు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడే సరికి మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారు. పరామర్శలు, ఆత్మీయ సమావేశాల పేరుతో మచ్చిక చేసుకునే ప్రయత్నం చేయ బోతున్నారు. ప్రజలు నేతల కుయుక్తులను గుర్తించాలని, విద్య, వైద్యం, ఉపాధి, రుణమాఫీ, ఇండ్ల పంపిణీ తదితర సమస్యలపై నిలదీయాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.