హవాయిలో 100 దాటిన కార్చిచ్చు మృతులు

హొనొలులు : హవాయి ద్వీపంలోని లాహైనా, మౌయిలు కార్చిచ్చుతో బూడిద కుప్పలుగా మారాయి. ఇప్పటివరకు ఈ ఘటనలో మరణించినవారి సంఖ్య 100 దాటినట్లు సంబంధిత అధికారులు ఆదివారం తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం వీలుందన్నారు. గత 100 ఏళ్లలో ఇంతటి తీవ్రమైన ప్రమాదం ఎన్నడూ చూడలేదని అమెరికాలోని ఫైర్‌ అడ్మినిస్ట్రేటర్‌ లోరీ మూర్‌ మెరిల్లీ పేర్కొన్నారు. ”అగ్ని ప్రమాద తీవ్రతను తక్కువగా అంచనా వేశాము” అని హవాయి కాంగ్రెస్‌ మహిళా నేత జిల్‌ పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం వల్ల విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అన్నారు. హవాయి ఎదుర్కొన్న అతిపెద్ద ప్రకృతి విపత్తు ఇదేనని మోయి గవర్నర్‌ జోష్‌ గ్రీస్‌ శనివారం పేర్కొన్న సంగతి తెలిసిందే. 2,200 నిర్మాణాలు పూర్తిగా కాలిపోయాయన్నారు. ఆస్తినష్టం సుమారు 6 బిలియన్‌ డాలర్లకుపైగా ఉంటుందని చెప్పారు.