రెండో రోజు 50కి పైగా కరోనా కేసులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా పెరుగు తున్నాయి. కొన్ని నెలల తర్వాత వరసగా రెండో రోజు 50కి పైగా కేసులు నమోదయ్యాయి. మంగళ వారం సాయంత్రం ఐదు గంటల నుంచి బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు 4,937 మందికి టెస్టులు చేయగా 54 (1.09 శాతం) మందికి పాజిటివ్‌ వచ్చింది. మరో 25 మంది కరో నా నుంచి కోలుకున్నట్టు వైద్యా రోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడిం చింది. ఒక వైపు ఫ్లూ జ్వరపీడితుల సంఖ్య పెరుగుతూ, మరోవైపు కరోనా కేసులు కూడా పెరుగు తుండటంతో ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.