వేకువ రాగం

 Morning melodyచీకటి చుట్టిన జీవన పయనంలో వెన్నెల
రెక్కలు కట్టి తలుపు తడితే..

మది నిద్దుర మరచిన కన్నుల్లోకి
ఇంద్ర ధనస్సు వచ్చి పలకరిస్తే..

చెలిమి తాకిన హదయ రాగంలో
అనురాగపు మధురిమలు
ఆప్యాయతను అల్లుకొని..
మమతలన్నీ తీగలా చుట్టుకున్నాయి..

వెన్నెలను ఎక్కుపెట్టిన ఆ నిశి రాతిరి
అద్భుతమైన స్వప్న లోకంలో విహరింపజేసింది…
జీవితాన్ని సరికొత్తగా మార్చేసింది.
మెలుకువ రాగాలు కంటి రెప్పలని
తట్టి లేపుతూన్నాయి..!!

కలలకు ఇపుడు కొత్తగా
వెలుగు రేఖలు పూస్తున్నాయి.!!

– స్వప్న మేకల, 9052221870