తాడిచెర్ల-ఖమ్మంపల్లి మానేరు బ్రిడ్జి ప్రారంభించడానికి వస్తున్న ఆమాత్యులారా…

నవతెలంగాణ- వరంగల్‌, భూపాలపల్లి
మీరు ప్రారంభిచ బోతున్న బ్రిడ్జి కి ఇరువైపులా ఇటు తాడిచెర్ల నుండి బ్రిడ్జి ఎక్కే దగ్గర,అటు ఖమ్మంపల్లి నుండి బ్రిడ్జి ఎక్కే దగ్గర అప్ప్రోచ్ రోడ్డుకు రెండు వైపులా సైడ్ రైలింగ్ పెట్టారా..?
స్పీడ్ బ్రేకర్లు వేశారా..?
బ్రిడ్జి పైన విద్యుత్ దీపాలు పెట్టారా..?
మరి ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా ఆఘమేఘాల మీద బ్రిడ్జిని ప్రారంభిస్తున్నారు, ఏదయినా ప్రమాదం జరిగి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే.. ఆ..ప్రాణ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలి.
కనీస రక్షణ చర్యలు లేకుండా మానేరు నదిపై కొత్తగా నిర్మించిన బ్రిడ్జిని ఎలా ప్రారంభిస్తారు..?
మానేరు బ్రిడ్జి పై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి
ఇటు తాడిచెర్ల నుండి బ్రాడ్జి మీదకు వెళ్లే అప్ప్రోచ్ రోడ్డుకు ఇరువైపుల రక్షణ కోసం సైడ్ రయిలింగ్ ఏర్పాటు చేయాలి,
ఖమ్మంపెల్లి వైపు కూడా సైడ్ రైలింగ్ ఏర్పాటు చేయాలి,
అలాగే అప్రోచ్ రోడ్లలో స్పీడ్ బ్రేక్ లు ఏర్పాటు చేయాలి,
నేటి యువత స్పోర్ట్స్ బైక్ లతో కొత్త బ్రిడ్జి కదా స్పీడ్ గా వెళ్లి ప్రమాదాలకు గురయ్యో ప్రమాదం ఉంది కాబట్టి రక్షణ చర్యలు చేపట్టి ప్రారంభిస్తే బాగుంటుంది,
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్ళు గడిచిపోతున్నాయి మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కానీ మా ప్రాంత ప్రజలకు
కిషన్ రావుపల్లె నుండి భూపాలపల్లి జిల్లా కేంద్రానికి రోడ్డు కలగానే మిగిలి పోయింది.

– దండు రమేష్
జిల్లా చైర్మన్ కాంగ్రేస్ పార్టీ దళిత విభాగం,జయశంకర్ భూపాలపల్లి జిల్లా