కర్ణాటక సీఎం కు మంథని ఎమ్మెల్యే శ్రీదర్‌ బాబు శుభాకాంక్షలు

నవతెలంగాణ-మల్హర్‌ రావు.
కర్ణాటక రాష్ట్ర సీఎంగా సిద్ధ రామయ్య, ఉపముఖ్యమంత్రిగా శివకుమార్‌ లు ప్రమాణ స్వీకారం చేశారు.ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని వీరికి జాతీయ కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి, కర్ణాటక రాష్ట్ర ఇంచార్జి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్‌ బాబు శుభాకాంక్షలు తెలిపారు.కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు అహర్నిశలు కషి చేసిన శ్రీదర్‌ బాబును సోనియా, రాహుల్‌,ప్రియాంక అగ్రనేతలు, అధిష్టానం అభినందించడంపై మంథని నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,యూత్‌,మహిళ కార్యకర్తల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరిగి మంతనికి రానున్న శ్రీదర్‌ బాబుకు పెద్దయెత్తున స్వాగతం పలకడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

Spread the love