సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్, వీవోఏల మండల అధ్యక్షురాలు కవిత
నవతెలంగాణ-చేవెళ్ల
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్, వీవోఏల మండల అధ్యక్షురాలు కవిత అన్నారు. సోమవారం ఐకేపీ, వీవోఏ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇందిరా పార్కు సమీపంలో మహాధర్నా చేపట్ట నున్నట్ట చెప్పారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల మండల వీవో ఏలు పాల్గొనకుండా చేవెళ్ల పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్య దర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉద్య మాలకు భయపడి ముందస్తు అరెస్టు చేయించడం తగద న్నారు. ఉద్యమాలను అణచివేయాలని చూడటం సరైంది కాదన్నారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగిస్తున్నారనీ, ఉద్యమాలను ఎంత అనచివేస్తే, ఉవ్వె త్తున పైకి లేస్తాయని హెచ్చ రించారు. ఈ ఉద్యమాలు, పోరా టాలు చేయకుండా తెలంగాణ రాష్ట్రం సాధించడం సాధ్యమైయ్యేదా అని ప్రశ్నించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పోరాటాలను ఉద్యమాలను అణచివేయాలని చూడడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిదికాదన్నారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీ ఆర్‌కు ఉద్యోగులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.