చెరువు అలుగు గండిని పరిశీలించిన: ఎంపీపీ దశరథ్ రెడ్డి

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని రామారెడ్డి పరిసర ప్రాంతంలో గల రంగా చెరువు అలుగు పక్కన, గత కొద్దిరోజుల నుండి కురుస్తున్న వర్షాలకు గండిపడటంతో గురువారం స్థానిక ఎంపీపీ నా రెడ్డి దశరథ రెడ్డి నాయకులతో కలిసి పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే సురేందర్ కు చరవాణి ద్వారా సమాచారం అందించడంతో, గండిని వెంటనే మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించినట్లు దశరథ్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ రవీందర్రావు, కాసర్ల రాజేందర్, భానూరి నర్సారెడ్డి, లేగల మహిపాల్ రైతులు తదితరులు పాల్గొన్నారు.