వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి: ఎంపీపీ దశరథ్ రెడ్డి

నవతెలంగాణ- రామారెడ్డి
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని బుధవారం స్థానిక ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ను వేయాలని, సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు వైద్యం మరింత దగ్గర కావాలని ప్రభుత్వం పల్లెదావకణాలకు రూ 24 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారని అన్నారు. కార్యక్రమంలో వైద్యులు సురేష్, వైద్య సిబ్బంది భీం, తదితరులు ఉన్నారు.