
హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్న లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలని వచ్చినలలో ఆడిట్ అధికారులు వచ్చే అవకాశము ఉందని ఇలాంటి లోటుబాట్లు లేకుండా పూర్తి చేసే విధంగా చూడాలని ఎంపిడిఓ రాములు నాయక్ అన్నారు. బుధవారం ఇందల్ వాయి మండల పరిషత్ కార్యాలయం లో ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ రాములు నాయక్ మాట్లాడుతూ కురు సంఖ్య పెంచుతూ అడిగిన వారందరికీ హాని కల్పించే విధంగా చూడాలని హరితహారంలో భాగంగా నాటిన, నాటవలసిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉపాధి పనుల వివరాలను అడిగి తెలుసుకుని సిబ్బందికి పలు సూచనలు, సలహాలను అందజేశారు. ఈ సమావేశంలో ఏపీవో పోశెట్టి, టెక్నికల్ అసిస్టెంట్లు, మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.