జెండాను ఆవిష్కరిస్తున్న ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి

– ర్యాలీ నిర్వహిస్తున్న హైస్కూల్ ఎన్ సీసీ కెడెట్లు
– వీణవంకలో రెపరెపలాడిన జాతీయ జెండా
నవతెలంగాణ-వీణవంక
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మండలంలో జాతీయ జెండా రెపరెపలాడింది. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ స్టేషన్ లో ఎస్సై ఎండీ ఆసీప్, పీఏసీఎస్ కార్యాలయంలో పీఏసీఎస్ చైర్మన్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి, జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ రాజిరెడ్డి, జీపీ కార్యాలయంలో సర్పంచ్ నీలకుమారస్వామి, ఆదర్శ వికలాంగుల కార్యాలయంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు పైడిమల్ల శ్రీనివాస్, హమాలీసంఘం, ఆటోయూనియన్, ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు, మండలంలోని అన్ని గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ గీలాపన చేసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీటీసీ మాడ వనమాల సాధవరెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతా శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.