ఎంపీటీసీ దంపతులు రాజీనామా…

నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
మండలకేంద్రానికి చెందిన ఎంపీటీసీ దంపతులు ఎర్రబెల్లి వనిత పున్నం చందర్‌ రావులు ఎంపీటీసీ పదవికి, మండల రైతు బంధు సమితి సభ్యత్వానికి రాజీనామా చేసి వారి రాజీనామా పత్రాలను జడ్పీ సీఈవో, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా వారు విలేక రులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం నుండి ఎన్నో పోరాటాలు చేశామని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో ఒడిదొడుగులను ఎదు ర్కొని, ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకున్న మమ్మల్ని ఆదరించి జిల్లాలో అత్యధిక మెజార్టీతో ఎంపీటీసీగా గెలిపించిన మొగుళ్లపల్లి ప్రజలకు, మాకు అన్ని విధాలుగా సహకరించిన బీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానానికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఎంపీటీసీగా గెలుపొందినప్పటి నుండి మాకు ఉన్న పరిచయాలతో మొగుళ్ళపల్లిలో కొన్ని అభివద్ధి పనులు చేసినప్పటికీ, రైతు బంధు సమితి సభ్యునిగా రైతులకు, ఎంపీటీసీగా గెలిపించిన ప్రజలకు ఎంతో సేవ చేయాలనుకున్న స్థానికంగా ఉన్న మండల, గ్రామ ప్రజా, ప్రతినిధులు సహకరించకపోవడంతో పాటు దళిత బంధు, గృహ లక్ష్మీ, బీసీ బంధులాంటి పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే సమయంలో తనకు ఎలాంటి సమా చారం అందించకపోవడంతో మనస్థాపం చెంది ఎంపీటీసీ పదవికి, రైతుబంధు సమితి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు, రైతులకు మేము అనుకున్న రీతిలో న్యాయం చేయలేక పోయినందున రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.