
ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామంలో ఎంపిటిసి కచ్చకాయల అశ్విని శ్రీనివాస్ అధ్వర్యంలో గురువారం గ్రామానికి చెందిన మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన బతుకమ్మ చిరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కచ్చకాయల అశ్విని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని వారి ముఖ్యమైన పండుగల సమయంలో ప్రభుత్వం తరఫున చిరలను పంపిణీ చేస్తుందన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషి తో మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న మహిళలకు కులం, మతం భేదం లేకుండా పంపిణీ చేపట్టాడం హర్షణీయమని పేర్కొన్నారు. పండుగల సమయంలో పేద నీరుపేద అనే తారతమ్యం లేకుండా సుఖసంతోషాలతో పండుగలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమం లో మహిళ సంఘాల సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.