ధర్మ యుద్ధం ర్యాలీకి బయలుదేరిన ముదిరాజ్ లు

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్:
పెద్దకొడప్ గల్ మండలంతో పాటు పరిసర ప్రాంత గ్రామాల నుండి దాదాపు 200 మంది ముడిరాజ్ లు కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగబోయే ధర్మ యుద్ధం ర్యాలీకి బయలుదేరుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాడు హన్మండ్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ లకు అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ తలపెట్టిన ధర్మాయుద్ధం ర్యాలీ  కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లాలని ముదిరాజ్ సంఘ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆయా పార్టీల్లో కొనసాగుతున్న ముదిరాజ్ లు తమ హక్కుల కోసం గళం విప్పాలని కోరారు. ముదిరాజ్ ల హక్కుల కోసం ఐక్యమత్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొర్రెరాములు, శంకర్, లింగరం, నాందేవ్, కృష్ణ, గణేష్, శ్రీనివాస్, రుక్మయ్య, శంకర్ ముదిరాజ్ సంఘ సభ్యులు బయలుదేరారు