అదనపు పి.పిని సన్మానించిన ముదిరాజ్ సంఘం

నవతెలంగాణ-భిక్కనూర్
రాష్ట్ర స్థాయిలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఎంపికైన నంద రమేష్ ను మంగళవారం సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు ఘనంగా శాలువాతో సన్మానించి అభినందించారు. అనంతరం గ్రామ వీడీసీ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ముదిరాజ్ ముద్దుబిడ్డ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ విడిసి అధ్యక్షులు బలరాం, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తిరుమల్, సంఘం సభ్యులు నర్సింలు, సిద్ధ రాములు, శ్రీనివాస్, రవి, తదితరులు పాల్గొన్నారు.