హైదరాబాద్ : బ్యాంకింగేతర విత్త సంస్థ ముఫిన్ గ్రీన్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించనున్నట్లు తెలిపింది. ఇందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కన్వర్టేబుల్ వారంట్స్ ద్వారా రూ.140 కోట్ల నిధులు సమీకరించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం 2.55 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు పేర్కొంది. ఒక్కో వారెంట్ సబ్‌స్క్రిప్షన్ ధరను రూ.55గా నిర్ణయించింది. శుక్రవారం బీఎస్‌ఈలో ముఫిన్ గ్రీన్ షేర్ 9.99 శాతం పెరిగి రూ.83.34 వద్ద ముగిసింది.