నవతెలంగాణ-గోవిందరావుపేట
ములుగు నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ములుగు జిల్లాను ఇచ్చింది అభివృద్ధి పరిచింది బీఆర్‌ఎస్ పార్టీ అని రాష్ట్ర గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో కమ్మ సంఘం ఫంక్షన్ హాల్ లో బంజారా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈకార్యక్ర మానికి ముఖ్య అతిథిగా మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై మాట్లాడారు. తెలంగాణలోని గిరిజనులు, ఆదివాసీల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ములు గును అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, మరింత అభి వృద్ధి చేసుకుందమన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికా రంలోకి వస్తే రూ.400లకే గ్యాస్, సౌభాగ్యలక్ష్మి కింద రూ.మూడు వేలు, తెల్లరేషన్ కార్డు దారులకు బీమా సౌకర్యం కల్పిస్తామని, కాంగ్రెస్ పాలనలో బంజారాలకు చేసిందేమీలేదని, మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ మారిందన్నారు. కాంగ్రెస్ వస్తే కర్నాటక కరెంట్ కష్టాలు తెలంగాణలోనూ పునరా వృతం అవుతాయని, కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని, కర్నాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నారన్నారు. తెలంగాణలో మూడు గంటల కరెంటు చాలని పీసీసీ అధ్యక్షుడు అనడంతో కాంగ్రెస్ రంగు తేలిపో యిందన్నారు. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణలో మూడు గంటల కరెంటే వస్తుందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ 24 గంటల పాటు రైతాం గానికి ఉచిత విద్యుత్తును అందిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. రౖతులపై ఉన్న ప్రేమ, చిత్తశుద్ధితో సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం రైతుల పట్ల ఎటువంటి మమకారం, చిత్తశుద్ధి లేదని బీఆర్‌ఎస్ పాలనలో తం డాలను జీపీలుగా చేసిన ఘనత నేత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో లంబాడా జాతికి ఏంచేశారో చెప్పాలని గిరిజనులకు బిజెపి అన్యాయం చేసిందని, మేడారానికి జాతీయ హోదా ఇవ్వలేదన్నారు .పదేళ్లపాటు గిరిజన యూని వర్సిటీ ఇవ్వకుండా కాలయపన చేసి గిరిజనులకు ద్రోహం చేసిందని, బిజెపి, కాంగ్రెస్ మాయమాటలు నమ్మే పరిస్థితిల్లో ప్రజలు లేరని, నీళ్ల కోసం కిలోమీటర్లు నడిచిన పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత స్వయంపాలన దిశగా అడుగులు పడ్డా యన్నారు. పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, సీఎం కేసీఆర్ పాలనలో ములుగు జిల్లాగా ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చేసుకుం టున్నామన్నారు. ములుగు బీఆర్‌ఎస్ అభ్యర్థి నాగ జ్యోతిని ప్రజలు ఆదరించి అధిక మెజార్టీతో గెలిపిం చాలని, అద్భుతమైన అభివృద్ధిని చేసుకుందామన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, జిల్లా పోరిక గోవిందనాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, బీఆర్‌ఎస్ మండలాల ఇంచార్జ్ సమ్మరావు, దేవ్ సింగ్, జెడ్పిటిసి హరిబాబు, ఎంపీటీసీ రామచంద్రు, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సాయిబాబు, సర్పంచ్ వాణి, సుమలత, బీఆర్‌ఎస్ నాయ కులు, తదితరులు పాల్గొన్నారు.