జాబ్ మేళ కోసం మద్నూర్ సంతలో ఆటో మైక్ ద్వారా ముమ్మర ప్రచారం

నవతెలంగాణ – మద్నూర్
ఈనెల 25న బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో నిరుద్యోగ యువతీ యువకుల కోసం జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళా ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం పంచుకోవాలని మద్నూర్ సంతలో సోమవారం నాడు  ఆటో మైకు ద్వారా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను మాట్లాడి జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కోసం 50 కంపెనీలలో భర్తీ చేయడానికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే కృషితో జాబ్ మేళ నిర్వహించడానికి నిశ్చయించిన దానికి జుక్కల్ నియోజకవర్గం లోని అన్ని మండలాల పరిధిలో గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ కార్యక్రమానికి హాజరై ఉపాధి పొందాలని ప్రచారం ముమ్మరంగా చేపట్టారు