
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ అక్కన్నపేట మండలాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసి ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలని అడిషనల్ డి ఆర్ డి ఓ రవీందర్ సూచించారు. శనివారం హుస్నాబాద్ లోని ఐకెపి కార్యాలయంలో హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల వరి ధాన్యము మార్కెటింగ్ సెంటర్ల కొనుగోలు కమిటీ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అడిషనల్ డిి ఆర్ డి ఓ రవీందర్ మాట్లాడుతూ వరి ధాన్యం ఏ గ్రేడు మద్దతు ధర రూ .2203, బి గ్రేడ్ రూ.2183 ఉందన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ డిపిఎం కర్ణాకర్ , డీపీఎం విద్యాసాగర్ ,ఎపిఎం జి శ్రీనివాస్ ,సి బి ఓ ఆడిటర్ ప్రసాద్, సిసిలు శివ చరణ్ సింగ్ ,తిరుపతి, రాజు, రవీందర్, అశోక్, సి ఓ లు జితేందర్, వినీత్ పాల్గొన్నారు.