అల్పాహారానికి 25 రూపాయలు ఇవ్వాలి..

నవతెలంగాణ- తాడ్వాయి
ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా డిఇఓ రాజు కు వినతి పత్రం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపునూరు చక్రపాణి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు అల్పాహారం రాగి జావా మధ్యాహ్న భోజనం అందించడం ఆహ్వాని  ఆహ్వానించదగ్గ విషయమే అయినా, వాటిని వండి పెడుతున్న కార్మికులకు కనీస వేతనం పెంచకుండా మెనూ చార్జీలు పెంచకుండా కార్మికుల ఇంటి నుంచి డబ్బులు తెచ్చి విద్యార్థులకు వండి పెట్టమనడం దుర్మార్గమన్నారు. 22 నెలల క్రితం పెంచిన 2000 రూపాయల వేతనం జీవో ఇచ్చిన బడ్జెట్ రిలీజ్ చేసిన నేటికీ కార్మికుల ఖాతాల్లో జమ చేయలేదన్నారు. ఈ పరిస్థితుల్లో 25 రూపాయలు ఖర్చయ్యే అల్పాహారానికి పది రూపాయల 50 పైసలు చెల్లిస్తామని మరింత కార్మికులకు ఆర్థికంగా దోపిడీ చేసే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. కావున అధికార యంత్రాంగం ఇప్పటికైనా ఆలోచించి అల్పాహారానికి 25 రూపాయలు మధ్యాహ్న భోజనానికి 50 రూపాయలు రాగిజావాకు ఒక విద్యార్థికి రెండు రూపాయలు చెల్లించడంతోపాటు కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని పైవాటిని అమలు చేసేంతవరకు విద్యార్థులకు పాత పద్ధతిలోనే భోజనం వండి పెట్టడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బాలరాజు దశరథ్ రియాజుద్దీన్ సాయిలు పాల్గొన్నారు
Spread the love