ఈవీఎం నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి

– వర్ధన్నపేట రిటర్నింగ్‌ అధికారి అశ్వినితానాజీ వాకడే
నవతెలంగాణ-వరంగల్‌
ఎన్నికల విధుల్లో భాగంగా ఈవీఎం, వీవీ ప్యాట్‌ల నిర్వహణపై అధికారులు, సిబ్బంది సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని వర్ధన్నపేట రిటర్నింగ్‌ అధికారి, అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకాడే తెలిపారు.జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్‌ పి.ప్రావీణ్య ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై శిక్షణ నిర్వహిం చడం జరిగిందని అన్నారు.బుధవారం డి ఆర్‌ డి ఏ సమావేశ హాలులో రిటర్నింగ్‌ అధికారులు, జిల్లా నోడల్‌ అధికారులు, సెక్టార్‌ అధికారులు , మాస్టర్‌ ట్రైనర్‌ లు, ఈవీఎంల మేనేజ్మెంట్‌ పై మాస్టర్‌ ట్రైనర్‌ శిక్షణ ఇచ్చారు.ఈవీఎంల నిర్వహణ ఏ విధంగా చేయాలో పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. పోలింగ్‌ ప్రారంభం అయ్యే ముందు పూర్తి అయిన తర్వాత చేయాల్సిన పనుల పై డెమో శి క్షణ ఇచ్చారు.బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వీవీ మిషన్‌ల అను సంధా నం, కమిషనింగ్‌, పోలింగ్‌ పూర్తయ్యాక సీల్‌చేసే పద్దతిని శిక్షణలో భాగంగా వివ రించారు. ఈవీఎం నిర్వహణలో తరచుగా వచ్చే సందేహాలను నివత్తి చేశారు. ఈ సందర్భంగా ఈవీఎం నిర్వహణపై భారత ఎన్నికల సంఘం మార్గదర్శ కాలను వివరించారు.ఈవీఎంల నిర్వహణ పకడ్బందీగా చేపట్టడంలో సెక్టార్‌ అధికారులు, పోలింగ్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ ల పాత్ర కీలకం అన్నారు. ఈవీఎంల నిర్వహణపై సెక్టార్‌ అధికారులు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, సహాయ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అధికారులకు శిక్షణ ఇవ్వను న్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈవీఎం నిర్వహణ చేపట్టి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు.ఈ శిక్షణ కార్యక్రమంలో నర్సంపేట రిటర్నింగ్‌ అధికారి ఆర్డీవో కష్ణవేణి , డి ఆర్‌ డి ఏ పి డి సంపత్‌ రావు జిల్లా ఎన్నికల నోడల్‌ అధికారి బాలకష్ణ సంబంధిత అధికారులు పాల్గొన్నారు .