టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌గా ముత్తిరెడ్డి

– బాధ్యతలు స్వీకరణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
టీఎస్‌ ఆర్టీసీ చైర్మెన్‌గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆర్టీసీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ముత్తిరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ప్రభుత్వం ఆర్టీసీ చైర్మెన్‌ బాధ్యతలు అప్పగించిందన్నారు. తన శక్తి మేరకు సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. సంస్థ ఉద్యోగులతోపాటు తాను కూడా సమష్టిగా పని చేసి ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడతానన్నారు. సంస్థను లాభాల బాటలోకి తీసుకెళ్లడంలో తన వంతు కృషి చేయనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ముత్తిరెడ్డి కతజ్ఞతలు తెలిపారు.ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌, ఇతర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబసభ్యులు హాజరయ్యారు.